శ్రీ
కృష్ణుని బాల్య క్రీడలు
కంసుని పంపున బాల ఘాతిని యైన పూతన వ్రేపల్లెకు సుందరీ రూపముతో వచ్చి శ్రీకృష్ణుని జూచెను. అందరును వలదని వారించు చున్నను వినక శ్రీకృష్ణునికి పాలిచ్చెను. శ్రీ కృష్ణుడు దాని పాలతో పాటు ప్రాణములు గూడా పీల్చివేయగా అది చచ్చి పడెను. బాలునికి రక్షా రేకు కట్టి నందాదులు శాంతి క్రియలు చేసిరి .
తరువాత త్రుణావర్తుడు సుడిగాలి వలె వచ్చి శ్రీకృష్ణునిపై కెత్తుకుని పోగా ఇతడు వానికి బరువయ్యెను. అక్కడనే వానిని జంపెను.
ఒకనాడు కృష్ణుడు మన్ను దిను చుండెను ,భూమికి ప్రియుడు గదా మరి ! గోప బాలురు యశోదకు ఈ సంగతి చెప్పిరి .ఆమె "ఏదీ ,నీ నోరుచూపు "మనగా నోరు దెరచి ఆమెకు బ్రహ్మాండము లన్నియు చూపెను .ఆమె విభ్రాంతి నొందెను.
శ్రీ కృష్ణుడు గోప బాలురతో గలిసి గొల్లల యిండ్లలో పాలు పెరుగు వెన్నలను తాను మెక్కి తోడి బాలురకు గూడ పెట్టెడి వాడు . గోవులయోద్దకు దూడలను విడిచి పాలు కుడి పెడి వాడు .ఇట్టి పనులెన్నో ! ఆ లీలలు వర్ణించుటకు ఆది శేషుని కైనను శక్తి చాలదు .
శ్రీకృష్ణుడు చిన్న తనములో కొంటె పనులతో పాటు అనేక లీలలు చూపెను .సామాన్య బాలకులు చేయలేని పనులు చేసెను. అంతకు మించి అల్లరి చేష్టలను చేసెను. ఇవన్నియు జనాకర్షణ ము కోసమును ,శత్రు సంహారము కోసమును.
చురుకైన వానిని మెచ్చుకొన్నట్లు ప్రజలు మందుని మెచ్చరు గదా ! అంతేకాదు ఎవరిది వారు తినుటకంటే పది మందికి పెట్టి తినవలేనన్న నీతిని భోదించుటకే యీ లీలలు. మొదటి నుండియు గొల్లలు , పాలు ,పెరుగు ,వెన్నలను అమ్ముకుని మిగిలినవి తినుటే కాని ,ఒకరికి పెట్టి యెరుగరు. అట్టివారికి త్యాగ గుణము భోధించి తరింప చేయుట వీనిలో ని పరమార్ధము . త్యాగము తోనే అమృతత్వ సిద్ది కలుగును గదా " త్యాగే ,నైకే అమృతత్వ మానశు: "అని వేద వాక్కు .

No comments:
Post a Comment