Saturday, December 21, 2013

శ్రీ వరాహ పూరాణము14





నచికేతుడు, యముడు ఊరిలో లేని సమయమున చూచి సంయమనీ నగరమునకు వెళ్ళెను. యముని భార్యాపుత్రాదులు, చిత్ర గుప్పాది పరిపారములు ఎన్ని విధములు బ్రతిమాలినను ఒక్క మెతుకైన ముట్టక ఉపవాసము లుండెను. మూడు రోజుల తరువాత యముడు వచ్చెను. నచికేతుని విషయ మాయనకు చెప్పిరి. ఆయన త్వరపడుచు వచ్చి నచికేతుని జూచి" యెప్పుడు వచ్చితి" వని ప్రశ్నించెను. యముడడిగిన ప్రశ్నలకు అతడు ఆకాశవాణి ఉపదేశించినట్లే  సమాధానము లిచ్చెను. యముడు నచికేతునకు " ఓ భగవానుడా! నమస్కారము. మూడు వరము లిచ్చెదను. కోరుకొను" మనెను. వరము లిచ్చి యైనను విప్రబాలకుని సంతోష పరచి యముడు తన సంపదలను కాపాడుకొన దలచెను.
నచికేతుడు " యమధర్మరాజా! నా తండ్రికి నాపై కోపము లేకుండ జేసి, నేను వెళ్ళగానే, చచ్చిన కొడుకు బ్రతికి వచ్చినాడని సంతోష పడునట్లు వర మిమ్ము. లేనిచో నన్ను ప్రేతమని వెడల గొట్ట వచ్చును" అనెను. యముడట్లే యని వర మిచ్చెను.

రెండొవ వరము కోరుకొను మనెను. నచికేతుడు, "నేను చేసెడి శ్రౌతస్మార్త కర్మములు అక్షయమైన ఫలము లిచ్చునవిగా వరమి" మ్మనెను. అతడు, ధ్యానింపదగినది అయిన అగ్ని యనమున వివరించి చెప్పి, దానిని సేవింపు మనుచు, ఈ యగ్ని నీ పేర నాచికే తాగ్నిగా ప్రసిద్ద నొంది, ఉపాసించిన వారికి స్వర్గాది ఫలముల నిచ్చునని వర మిచ్చెను.

 First  2   3  4  5  6  7  8  9  10  11  12  13  14  Last

No comments:

Post a Comment