మరల చిత్త గింపు మని యుద్భోధించి దీనిని యితరుల కెవ్వరికిని
బోధింప వలదనియు, దీని నుల్లం ఘించిన యెడల దేవత
లావేశ
పరులై శపించ గలరని యాదేశించెను.
అధ పృష్టో
మయా నిప్రో - భగవాన్బాద రాయణఃభగవన్! దేవతా స్సర్వా ! - క్షుభ్యంతి చ శపంతి. 7
తాసా మత్రాస్తి కా హాని - ర్యయా కుప్యన్తి దేవతా,
పారాశ ర్యోధ మామాహ - యత్ప్రుష్టం శృణు వత్సల ! 8
ఇంతటితో నేను ఓయి ముని పుంగవా ! ఇటులేల బలుకు చున్నారు.
ఈ శివ గీతను ఇతరులు దెలుసు కున్నంత మాత్రమున దేవతలకు
కలిగే చెరుపే ( నష్టమేమి )? అలా కోపగించుటకు హేతువేమి?
ఎందులకు శపింతురు. అని ప్రశ్నింపగా వేదవ్యాసుడు నా యందు
గల శిష్య వాత్సల్యముతో నిట్లాదేశించెను.
నిత్యాగ్ని హోత్రి ణో విప్రు స్సన్తి ఏ గృహ మేధిన :
త ఏవ సర్వ ఫల దాస్సు - రాణాం కామదేనవ :9
భక్ష్యం భోజ్యం చ పేయం చ - యద్యదిష్టం సుపర్వణామ్,
అగ్నౌ హుతేన హవిషా - తత్సర్వం లభ్యతే దివి 10
నాన్య దస్తి సురేశానా - మిష్ట సిద్ది ప్రదం దివి,
దోగ్ద్రి దేనుర్య ధా నీతా - దుఃఖ దా గృహ మేదినామ్ 11
తధైవ జ్ఞాన వాన్ విప్రో - దేవానాం దుఃఖ దో భవేత్,
త్రిద శాస్తేన విఘ్నన్తి - ప్రవిష్టా విషయం నృణామ్ 12
ప్రపంచములో నెల్లప్పుడు ద్విజ శ్రేష్టుడు గృహస్తాశ్రమం లో
నుండి జ్యోతిష్టో మము మొదలగు యజ్ఞములు చేయుచు,
అమరవరుల కేయే వస్తువులు ఇష్టములో నాయా భక్ష్య భోజ్య ,
చోష్య పానాదులు బర్హిర్ముఖ శ్రేష్టులకు అగ్ని ద్వారా హవ్య దానం బొనర్చు
చున్నాడో అతడే బృందా రకుల పాలిటికి గల్ప వృక్షము వంటి వాడు,
ఆ దేవతల అంతులేని ఆనంద భరితులై నిర్మల మనస్కులై యగ్ని
ద్వారా సమర్పించు వాటిని ప్రేమతో గైకుందురు కావున
మానవుండైనను అమరుల కధిక ఆనంద దాయకము లైన
యద్వరంబులను గావించి, వారి వారికి వహ్ని ద్వారా బలిని
సమర్పించు చుండవలెను. అట్లు చేయకుండ యోగాద లొనర్చి,
అమరులను విస్మరించి, కర్మలను త్యజించి వర్ణనా తీతమైన
ఆనందాను భవ తృప్తీ నొంది న వాడైన ఎడల క్రతు భుక్తులు తమ
కోరికలు దీరకుండుట వలన అసంతృప్తి చేత కుపితులై శాపింప
బడుదురు మరియు, పాల నొసగు గోవును మరొకడు వేరు
మార్గమున గొనిపోవ న గృహస్థుడు ఎంతటి వ్యధ గలవాడై
చింతించి వెదకి మరల తన మార్గమునకు మరల్చు కొనునో,
అదే రీతిగా దేవతలు మిగుల విచారము గలవారై తమ మార్గమును
బరిత్య జించి మోక్ష గామి యగు వానిని యనేక విధముల
ఆటంకము లనే గల్పించి ముందుకు బోనివ్వ కుండా
అన్య మార్గమునకు బ్రవేశింప చేతురు.
No comments:
Post a Comment