Sunday, December 15, 2013

శ్రీ మద్భాగవతము10




తే. కర్మ వశమున నెందు సుఖమ్ము లేక
    దేవ తిర్య జ్న్రయోనుల దిరుగు నాకు
    వెలయనే జన్మ మందున వీరు తల్లి
    దండ్రులైనారు ? చెప్పవే తాపసేంద్ర !
అని పలికి ఆ జీవుడు వెళ్ళిపోగా చిత్ర కేతుడు మోహము విడిచి బాలునికి యమునా నదిలో ఉత్తర క్రియలు చేసెను . నారదునకు నమస్కరించ గా అతడు రాజునకు నారాయణ మంత్రము పదేశించెను.
నియమ నిష్టలతో ఏ మంత్రము నైనను ఏడు రోజులు జపించినచో సిద్ది కలుగును. రాజట్లు ఏకాగ్రత తో ఏడు రోజులా మంత్రమును జపించాగా ముకుందుడు ప్రసన్నుడై విద్యాధరాది పత్యమును ,విమానమును అనుగ్రహించెను .
ఒకనాడతడు విమానముపై కైలాసము మీదుగా బోవుచు కొలువులో నున్న శంకరుని దర్శనము చేసికొని నమస్కరించెను .ఒకే పీటముపై పార్వతిని తొడమీద కూర్చుండ బెట్టుకున్న శివుని జూచి " మీరు ప్రకృతి పురుషులు కావచ్చు .ఏకాంత సమయములో నిట్లు కూర్చుండ వచ్చును. గాని నిండు సభలో నిట్లుండుట న్యాయమా ? "
అని యాక్షే పించెను . పార్వతి కోపించి ,"ఇందరును ఏమనలేదు గాని నీవు మాత్రము మమ్ము అధిక్షేపింతువా ? ఇంత అహంకారము గల నీవు రాక్షస జన్మ మెత్తుము. "అని శపించెను . చిత్ర కేతుడు తన తప్పు తెలిసికొని ఉమాశంకరులకు నమస్కరించి "అమ్మా ! జీవులకు వారి వారి కర్మములవలన జనన మరణములు ,సుఖ సంపదలు కలుగు చుండు ననుట కిదియే నిదర్శనము .నన్ననుగ్రహింపుము. నీ శాపమునకు నేను భయపడుట లేదు. జగత్పితురు లైన మిమ్ము అధిక్షేపించినందుకు చింతించు చున్నా " నని మ్రొక్కి వెడలిపోయెను .
తరువాత అందరును వినుచుండగా పార్వతితో శివుడు "చూచితివా ? విష్ణు భక్తుల నిస్స్ర హత్వము ! వారికి సుఖ దుఃఖములు సమానములు .తిరిగి నీకు శాప మియ్యగల వాడైనను శాంతుడు కాన నీ శాపమును తల దాల్చి వెడలిపోయెను " అని పలికెను.
అతడే త్వష్ట చేసిన పుత్రకామేష్టిలో దక్షిణాగ్ని యందు వృత్రాసుడుగా జన్మించెను .అతనికి ఆ ధర్మము, జ్ఞానము పూర్వ జన్మము నుండి సంక్రమించినవే .

No comments:

Post a Comment