శ్రీ స్కంద పురాణము6
భద్రాయువు
చరిత్ర
పూర్వ మవంతి దేశములో ఒక బ్రాహ్మణు
డుండెను. అతడు కుల ధర్మమును విడిచి వేశ్యా లోలుడై యుండెను. ఒక నాడా వేశ్య
యింటికి ఋషభుడను శివ యోగి వచ్చెను .వేశ్యయు బ్రాహ్మణుడును ఆయనకు పరమ భక్తితో
సేవలు చేసి ,పిండి వంటలతో భోజనము పెట్టి పరిచర్యలు చేసిరి. ఆయన వారిని
దీవించి వెళ్లి పోయెను.
కాలాంతరమున బ్రాహ్మణుడు మరణించి దశార్ణ దేశ
రాజు భార్య కడుపున బడెను. ఆమె సవతులు ఆమెకు విషము పెట్టిరి .కాని ఆమె
చావలేదు . నెలలు నిండగానే ఆమె కొడుకును గనెను .
విష ప్రభావముచే ఆ తల్లి కొడుకుల
దేహముల నుండి వ్రణములు పుట్టి పెద్దవయ్యెను. రాజు ఎన్నో చికిత్సలు చేయించెను .
కాని తగ్గలేదు. రాజు విసిగిపోయి తల్లి కొడుకులను అడవిలో విడిచి
పెట్టించెను. ఆ సమీప నగరములో సంపన్నుడైన పద్మాకరుడను వైశ్యుడు ఉండెను.
అతని ఇంటిలోని దాసి ఒకతే వీరిని జూచి తన యజమాని దగ్గరకు తీసికొని పోయి ,వారికి రక్షణ కల్పింపుమని
ప్రార్ధించెను. అతడు అంగీకరించి తన యింట
నుంచుకొని చికిత్స చేయించు చుండెను. ఒకనాడు వ్రణముల బాధతో రాకుమారుడు
మరణించెను.రాజ పత్ని యేడ్చు చుండగా శివయోగి ఋషభుడు వారింటికి వచ్చెను. అతడు
రాజ పత్ని నోదార్చి నను ఆమె శాంతింప లేదు. అపుడా యోగి భస్మము నా బాలునిపై
చల్లి బ్రతికించెను. తరువాత భస్మ మంటిన చేతితో ఆ మాతా పుత్రుల శరీరములను
తాకెను. వారు వ్రణములు పోయి ఆరోగ్య వంతులైరి.
No comments:
Post a Comment