చంద్రాంగదుడు - సోమవార వ్రతము
నల దమయంతుల కుమారుడు ఇంద్రసేనుడు . అతనికి చంద్రాంగదుడు అను కుమారుడుండెను . అతడు సమస్త విద్యాకుశలుడై యువరాజ్య పట్టాభి షిక్తు డయ్యెను . అతనికి చిత్ర కర్ముడను రాజు తన కుమార్తె సీమంతిని నిచ్చి పెండ్లి చేసెను . చంద్రాంగదుడు అత్తవారింట్లో కొన్నాళ్లుండెను. ఒకనాడు యమునా నదిలో నౌకా విహారము చేయుటకై మిత్రులతో వెళ్ళెను. పెద్ద గాలి విసిరి పడవ తిరుగ బడి అందరును నీళ్ళ పాలైరి . చిత్ర కర్ముడు చంద్రాంగదుని కై వెదకించెను. లాభము లేక పోయినది . విచారముతో ఇంటికి బోయి, కుమార్తెకు అలంకారము లన్నియు తీసి వేసెను. ఆమె వితంతు వేషముతో నుండెను . ఆమెను జూచి మైత్రేయి అను మునిపత్ని ,"పరమ శివుని ఉద్దేశించి సోమవార వ్రతమును దీక్షతో చేయుము .నీకు శుభములు కలుగు " నని బోధించి ఆమెకా వ్రతము చేయు విధానము చెప్పి వెళ్ళెను . ఆమె ఆ సోమవార వ్రతము చేయ నారంబించెను (సోమః = ఉమయా సహితః శివః = పార్వతితో గూడిన శివుని సోముడందురు. అతనికి ఇష్టమైనది సోమవారము .ఆనాడు అతనికి గూర్చి చేయు వ్రతము ).
చంద్రాంగదుడు నీటిలో మునిగి నాగలోకము చేరెను . ఇతనిని తెచ్చిన నాగ కన్యలు తక్షకు నెదుట నిలువ బెట్టిరి .తక్షకు డతనిని జూచి " నీ వెవరి కుమారుడవు ? ఎందుకీ లోకమునకు వచ్చితివి.?" అని యడుగగా ,రాజకుమారుడు ,తాను నిషధ దేశాది పతియైన నలుని పౌత్రుడ ననియు యమునలో నౌక విహారము చేయుచు ప్రమాద వశమున నీటిలో మునిగి యా లోకమునకు వచ్చితి ననియు ,తక్షకు ని వంటి మహాత్ముని దర్శనము వలన ధన్యుడనైతి ననియు తన కధ వినిపించెను. తక్షకుడు అతని వినయ విధేయతలకు ఆనందించి తన ఇంట కొన్నాళ్ళు ఉండమనెను. చంద్రాంగదుడు , "ఇప్పటికే నా వారందరును నన్ను చచ్చిన వారిలో లెక్క వేసి యుందురు . నెను వెళ్లి నా తల్లి దండ్రులకు ను ,నా భార్యకును ,అత్తమామలకును సంతోషము గలిగింపవలెన
No comments:
Post a Comment