వరాహ పూరాణము
వరాహాతారము ధరించి పాతాళము నుండి తన నుద్దరించిన శ్రీ మహా విష్ణువును స్తుతించి, భూదేవి యడిగిన ప్రశ్నలకు సమాధాన రూపముగా ఈ వరాహ పూరాణము వెలసెను. వరాహమూర్తి చెప్పినది కావున వరాహపురాణ మని పేరొందెను.
రైభ్యముని
ఒకప్పుడు రైభ్యుడను మునీంద్రుడు బృహస్పతి దగ్గరకు వెళ్ళి " మహాత్మా! సత్కర్మములు చేసిన మోక్షము గలుగునా? లేక బ్రహ్మ జ్ఞానము వలన మోక్షము గలుగునా?" యని ప్రశ్నించెను.
దేవగురుడు, " జ్ఞానము గలిగినవాడు సత్కరములు గాని, బ్రతుకుట కవసరమైన దుష్కర్మములు గాని మాధ వార్పణ బుద్దితో చేసినచో ఆ పుణ్యపాపములు వాని నంటవు. దీనికొక కధ యున్నది. వినుము.
విష్టరకుడను బోయవాడొకడుండెను. అతడొకనాడు లేళ్ళమందను తరుముచు బోవుచుండగా సంయమనుడను బ్రాహ్మణుడు చూచి," ఎవరికి హాని చేయని ఈ లేళ్ళను జీవ హింస ఏల చేయుచున్నా"వని యడిగెను. అతడు పెద్ద పెట్టున నవ్వి, " ఓయీ, వెఱ్ఱి బ్రాహ్మణుడా! లేళ్ళను జంపుటకు నేనెవ్వడను? పర మాత్మయే నా చేత ఉదర పోషణ కైయీ పని చేయించుచున్నాడు. ఒక బాలుడు మట్టితో బొమ్మను చేసి యాడుకొని తరువాత పాడుచేయును. అట్లే భగవానుడు సృష్టి చేసి మరల తానే నశింపజేయును" అనగా విప్రుడు కిరాతున కింత జ్ఞాన మెట్లుండునని సందేహించెను.

No comments:
Post a Comment