రాజు మార్కండేయుని వెదుకు కొనుచు బోయి, అతనికి నమస్కరించి " ఇంద్రద్యుమ్నుని గూర్చి మీరేమైనా చెప్పగలరా ?" యని యడిగెను. ఆయన నాకు తెలియదు కాని
నాకు మిత్రమైన
ఒక బకము గలదు. అది నాకంటేను చాలా పెద్దది. అది చెప్పగలదు ర " మ్మని తీసుకొని వెళ్ళెను.
నాడీ జంఘుడను ఆబకము వారికి మర్యాదలు చేసి " నాకు పదునాలుగు కల్పములు గుర్తున్నవి .కాని యింద్రద్యుమ్నుని గూర్చి వినలేదు. " అనగా రాజును ,మార్కండేయుడను నిరుత్సాహ పడిరి .రాజు " నేను పుణ్య హీనుడనై బ్రహ్మ దగ్గరకు వెళ్లి మరల అతనిచే పొమ్మని పించుకోలేను. అగ్ని ప్రవేశము చేసేద " ననగా బకము రాజా ! నాకంటే వృద్దమైన ప్రాకార కర్ణుడను గ్రుడ్ల గూబ కలదు. దాని నడుగుదమని ఈ ముగ్గురను వెళ్లి అతనిని చూచి యింద్ర ద్యుమ్నుని గూర్చి యడిగిరి. ఆ గూబ " మిత్రులారా ! నేను పుట్టి ఇరువది ఎనిమిది కల్పములైనది . ఆ రాజును గూర్చి వినలేదు. కాని నా కన్న వృద్దమైన గ్రద్ద యొకటి గంధ మాదన పర్వతము మీద నున్నది .దానినడుగుద " మని వారితో గూడా బయలుదేరి గ్రద్ద యొద్దకు వచ్చి ఆ రాజును గూర్చి యడిగెను. ఆ గ్రద్ద , నే నా రాజును గూర్చి విని యుండలేదు . కాని నా కంటే పెద్దదైన మండరకుడను తాబేలున్నది. దాని నడుగుద " మని చెప్పుచు ,తాను గూడ వారితో మంధరకుని యొద్దకు వెళ్ళెను. మంధరకుడు వీరిలో రాజును జూచి నీటిలోనికి పారి పోగా వారు అతనిని బిలిచి ,మిత్రులకు మర్యాద చేయకుండా బోవు చున్నావేమి? " అని యడుగగా అతడు, "నేనీ రాజును జూచి భయపడి పారిపోవుచున్నాను . విశాలమైన బొరుసు కలిగి యున్నందున నన్నీతడు అనేక యజ్ఞములలో వేదికగా నుపయోగించు కొనెను. ఇప్పటికిని ఆ కాలిన పుండు మానలేదు. మరల నన్ను యజ్ఞ వేదికగా వాడుకొనుటకు వచ్చినాడే మోయని భయ పడినాను .అంతే కాని అతిధి మర్యాదలు తెలియక కాదు." అనగానే ఇంద్రద్యుమ్నుని కొఱకు దేవలోకము నుండి విమానము వచ్చెను .దేవదూతలు రాజు నాహ్వానించిరి. రాజు, "నా మిత్రులైన వీరినందరిని గూడ నాతో రానిచ్చినచో స్వర్గమునకు వచ్చేద " ననెను. వారు "రాజా ! వీరందరును శివారాధనము చేసి ప్రమధ గణములలో చేరిపోయిన వారు కర్మ వశమున శాప గ్రస్తులై యిట్లున్నారు . శాపములు తీరగానే వీరు శివ సన్నిధికి చేరుదురు. నీవు రమ్ము పోవుద" మనిరి.
రాజు ఆ మాటలు విని " ఆలాగుననా ! వీరు శివారాధనము చేసి శాశ్వత స్థానము నొందినారా? నేను గూడా అట్టి శాశ్వత స్థానము నెల సంపాదింప రాదు ? స్వర్గమునకు బోయినచో కొంత కాలమునకు నీ పుణ్యము క్షీణించినది కావున పొమ్మందురు. అట్లు అనిపించు కొను టెందుకు ? మిత్రులారా ! నాకు గూడ శివారాధనము చేసి మోక్షము నొందు మార్గముపదేశింపు " డని పలికి ,వచ్చిన దేవ విమానమును పంపి వేసెను.

No comments:
Post a Comment