(రెడ్డి రాజులు)
శ్రీ శైలము నందలి శానస మొకటి 'అనవతర పురోహిత కృత సోపాన, శ్రీ పర్వత అహొబల సోపాన నిర్మాత పాగ్చ రామ పతిస్సే విత' అని అతని గురించి చెప్పినది.ఈ శాసనము శాశ 1281 నాటిది. ప్రోలయ వేమారెడ్డి చీమకుర్తి శాన మొకటి యున్నది. అది ........ ప్రఖ్యాతి గాంచిన శ్రీ పర్వతము, అహొ బలము లోని ఆలయములకు సోపానములు కట్టించెను- అని వచించినది.
మరియొక శాసనమున గూడ ఈతడు సోపాన నిర్మాణము ఒనర్చి నట్లు చెప్ప బడినది. ఇది గాక దినయందు 14 దుర్గములు నిర్మాణము చేయించి 12 సంవత్సరములు ఈయన ప్రభుత్వము చేసి నట్లున్నది. ( ఎల్ ఆర్ 57 ) ('అన పోతారెడ్డి " యను పేరా వ్రాయ బడినది).
బాల సరస్వతి వ్రాసిన ఒక శాసనము అన పోతారెడ్డి (ప్రోలయ వేమారెడ్డి పెద్ద కుమారుడు) శ్రీ సైలమునకు కొన్ని మెట్లు కట్టించి నట్లు కాన వచ్చును. బాల సరస్వతి వ్రాసిన శాసనమున హేమాద్రి దానైర్ధ రాణి సురాణా౦ మహా చలం హస్త గతం విహాయ} యశ్చారు సోపనపతేన చక్రే శ్రీ పర్వతం సర్వ జానాను గమ్యమ్ అని యున్నది.
అన వేమారెడ్డి శ్రీ శైలము విర శిరో మండపము కట్టించినాడు. ఈయన కాలము క్రీ:శ : 1377 కొన్ని మెట్ల శ్రీ శైలమున ఎయనము నిర్మించెనని శాసనములను చున్నవి. మన్యమా పుర శాసన మిందుల కాధారము.
శ్రీ శైలము దేవాలయములో ని శాసన మొకటి శాశ 1299 ది 'తన తండ్రి అన్నయ రెడ్డి అక్షయ పుణ్యము కొరకి వీర మండపము నిర్మింప బడిన దాని, యీ మండపములో అనేకులు విరు ఇచ్చాపూర్వకముగా తమ శిరస్సులు , నాల్కలు , చేధించు కొనిరి'అని అనుచున్నది. కర్నూలు జిల్లా మాన్యుయల్ - అన వేముడే విర మండపము కట్టించి నట్లు చెప్పు చున్నది. దీనిని పంచ భిక్షి౦ మల్లయ్య ' అను వాడు కట్టినాడు క్రీ:శ 14 లోని ఒక శాసనము వలన ని విర శిరో మండపము కట్టిన వాడు మల్లన యని తెలియ వచ్చుచున్నది. ప్రోలయ వేమన కాలమున పాతాల గంగకు మెట్లు కట్టినవాడు పంచ భిక్షం రామ లింగము' అతని కోడకి తడని చారిత్రకులను చున్నారు. ఇట్లు రెడ్డి రాజులు ముగ్గురు'ప్రోలయ వేమా రెడ్డి అన పోత రెడ్డి , అన వేమా రెడ్డి' అను వార హొ బలమునకు, శ్రీ శైలమునకు మెట్లు కట్టించి నారని పై శాసనముల బట్టి చారిత్రికులు అభి ప్రాయ పాడుచున్నారు. క్రీ:శ 1405 లోని ఒక శాసము కుమార వేమా రెడ్డి డుకు కాటయ వేమా రెడ్డి శ్రీ శైల మల్లి కర్జునుని దక్షణ ద్వారముమొదలు శిఖరే శ్వరమున వరకు మెట్లు కట్టించి నట్లు చెప్పు చున్నది.
బుక్క రాయల కొడుకు హరి హర రాయులు 1377 ప్రాంతము వాడు. వన వస ప్రభువు కదంబ రాజ కుమారి విట లాంబతో ఇటకు వచ్చెను. ఆయన 1393 న శివ రాత్రి దినమున ముఖ మండపము కట్టి స్వామికి సమర్పించినాడు. శాశ 1328 నాటి శాసనము ఈ విషయమును తెల్పు చున్న
No comments:
Post a Comment