" మా భూత్త్రై పూరుషీ విద్యా మా భూత్త్రై పూరుషం ధనం,
మా భూత్త్రై పూరుషీ ముక్తి : కాశ్యాం నివ సతాం నృణామ్"
(కాశీలో నివసించు వారికి మూడు తరాల వరకును విద్య ,సంపద, ముక్తి లేకుండును గాక ) అని శపించెను . శాప మిచ్చిన తరువాత కూడా మరల బిక్షకై వీధి వీధియు తిరిగెను .కాని బిక్ష లభింపలేదు .కోపముతో చేతిలో ని బిక్ష పాత్రను నేలమీద పగుల గొట్టి ఆశ్రమమునకు బోవుచుండగా ఒక ఇల్లాలు వ్యాసుని బిలిచి ," మునీంద్రా ! నా భర్త వృద్దుడు ప్రతిదినము అతిదులకు బెట్టకుండా తినడు .ఈనాడు ఎవరును అతిధులు రాలేదు. ఆయన భుజించ కుండా కూర్చున్నాడు . మీరు అతిదులుగా దయ చేయుడు" అని పిలిచెను . వ్యాసుడు ఆమెను జూచి ఆశ్చర్యపడి ," అమ్మా ! నిన్న ,ఈనాడు కాశీలో మా మొగము చూచిన వారు లేరు. నీవు భోజనమునకు బిలిచినావు. సంతోషము. నేనోక్కడను కాను నాకు పదివేల మంది శిష్యులున్నారు వారును నావలెనే ఆకలికి తట్టుకొన లేకున్నారు " అనెను. ఆ ముత్తైదువ " అట్లైనచో మీరందరును భోజనమునకు రండు ఆలస్యము చేయకూడదు " అనగా వారందరును సంతోషపడి వచ్చిరి. పాద ప్రక్షాళన చేసికొని అందరును కూర్చుండిరి. వడ్డించిన పదార్దములు చూడగానే ,ఆ వాసనతోనే వారికి చాలా సంతృప్తి కలిగినది. కడుపులు నిండునట్లు వ్యాసుడును ,శిష్యులను భుజించిరి. కాళ్ళు ,చేతులు కడుగుకుని యాచా మించి ఆ ఇల్లాలిని దీవించి బయలుదేరుటకు సిద్ద పడిరి. అపుడా ఇల్లాలు వ్యాసునితో , "తీర్ధ వాసులకు ముఖ్య ధర్మ మేది యని మా భర్త అడుగుచున్నాడు " అని పలికెను. వ్యాసుడు " తల్లీ ! అల్పజ్ఞుడను నేనేమి చెప్పగలను అన్నియు నీకు తెలియును . అడిగితివి కనుక చెప్పుచున్నాను .ఆకలి గొన్న వారికి అన్నము పెట్టుట కన్నను, తిన్నవారు అన్నదాతకు సంతోషము కలిగించుట కన్నను ఉత్తమ ధర్మము లేదు "అనెను.ఆమె "అదే ధర్మ మైనచో యధాశక్తి గా చేయుచున్నాము .నీవు సామాన్య ధర్మములను జెప్పు " మనెను. అప్పుడు వ్యాసుడు ," ఎవరిని నొప్పించ కుండా మాట్లాడుట ,ఇతరుల ఉన్నతిని జూచి ఈర్ష్య పడ కుండుట ,ఆలోచించి పనిచేయుట ,తానున్న స్థానము వృద్ది నొంద గోరుట అనునవి ప్రతి మానవునకు ను సామాన్య ధర్మములు "అని చెప్పెను. అది విని వృద్ద గృహస్థుడు "మునీంద్రా ! ఈ ధర్మములలో నీ యందున్న వెన్ని ?" అని ప్రశ్నించగా వ్యాసుడు నిశ్చేష్టుడై చూచెను. మరల ఆయన ఇట్లనెను. " ఈ ధర్మములు చెప్పుటకు నీవే అర్హుడవు. నీకన్న మృదువైన మాట తీరును ,ఆలోచించి పనిచేయు స్వభావమును ,ఉన్న ఇంటికి మేలు గోరు తత్వమును ,ఇతరుల ఔన్నత్యమును సహించు శాంత స్వభావమును మరెవ్వరి కుండును?
No comments:
Post a Comment