శ్లో || సత్యం బ్రూయా త్ప్రియం బ్రూయా
న్న బ్రూయా త్సత్య మ ప్రియం
ప్రియంచ నావృతం బ్రూయా
దేష ధర్మో ఘటో ద్బవ! (స్కందః )
పెద్దలు వచ్చినపుడు లేచి తన పీటమును వారి కియ్యవలెను . పెద్దల ముందు కాళ్ళు చాపి కూర్చుండుట , పరుండుట పనికి రాదు . పెద్దలను ప్రత్యక్షముగా గాని పరోక్షమున గాని నిందింప రాదు . ఎదుటి వారిని స్తుతించుట ,ఆత్మ నింద పనికి రావు.
శ్లో || శ్రద్దయా ప్రతి గృహ్ణా తి శ్రద్ధ యాయః ప్రయచ్ఛతి
స్వర్గి ణౌ తావు భౌస్యాతాం పతతో శ్రద్దయా త్వదః ||
తా || దానము ఇచ్చువాడును ,పుచ్చుకొనువాడును శ్రద్ధ గల వారైనపుడు ఇద్దరికి స్వర్గ సుఖము గలుగును. శ్రద్ధ లేనిచో పతనము చెందుదురు.
వేద విద్యను శిష్యులకు దానము చేయుట వలన బ్రాహ్మణుడు బ్రహ్మ లోకమును బొందును.
అసత్య మాడినచో .చేసిన పూజల ఫలము నశించును. గర్వము వల్ల తపము నాశన మగును. పదిసార్లు పొగడుకొనుట వలన తానిచ్చిన దానము వలని ఫలము నశించును. బ్రాహ్మణుని దూషించినచో ఆయుర్దాయము నశించును .
వ్యాసుడు కాశి ని శపించ బోయి భంగ పడుట
ఒకప్పుడు వ్యాసుడు శౌనకాది మహామును లుండెడి నైమిశారణ్యము నకు వచ్చెను. వేదములు విభజించిన వాడనియు ,పురాణములు రచించిన వాడనియు వ్యాసుని యందున్న గౌరవముతో మునులు ఆయనకు మర్యాదలు చేసిరి.
అప్పుడా మునుల మధ్య ముక్తి నిచ్చెడి వాడు .విశ్వేశ్వరుడా ? లేక విష్ణుమూర్తి యాయని చర్చ జరుగు చుండెను. ఆ మునులందరును చివరికి విశ్వేశ్వరు డొక్కడే ముక్తి దాత .మరొక డెవ్వడును కాదనిరి . అప్పుడు వ్యాసుడు లేచి చేయి పైకెత్తి ," ఇదిగో ,నేను చెప్పుచున్నాను వినుడు. వేదములందును ,రామాయణ భారత ములందును,పురాణము లందును వర్ణింప బడిన వాడొక్క విష్ణు మూర్తియే . అతడే సృష్టి స్థితి లయములకు కారణ భూతుడైన యాది పురుషుడు .కావున అతడే మోక్ష దాత . శివుడు కాడు" అని నిష్కర్ష చేసెను. అది విని మునులందరును ఆశ్చర్య మొంది," మహానుభావా ! నీవు సర్వజ్ఞుడవు నీ కంటెను తెలిసిన వారెవ్వరున్నారు? అయితే,
నీ విప్పుడన్న మాటలు కాశిలో విశ్వేశ్వర సన్నిధిలో చెప్పినచో మాకు ఆనందము కలుగును " అనిరి. వ్యాసుడంగీకరించి తన పదివేలమంది శిష్యులతోను , మునులతోను కాశీకి వెళ్ళెను . అక్కడ పంచ న దనమున స్నానము చేసి బింధు మాధవుని భక్తితో సేవించి తరించెను.
No comments:
Post a Comment