సూర్యుడుదయించెను .కాని రధము ముందునకు సాగలేదు. వింధ్యము అడ్డుగా నిలిచెను. నక్షత్ర గ్రహ సంచారము లాగి పోయినవి. అహొ రాత్రముల భేదము తెలియ లేదు. మునుల స్నాన సంధ్యాది కృత్యములు స్తంబించి పోయినవి.
బ్రహ్మాది దేవతల యొద్దకు పోయి మునులు మొర పెట్టుకొనిరి . వారందరు ఆలోచించి మహాతపశ్శాలి యయిన అగస్త్యుడు తప్ప మరొకరు దీనికి పరిష్కారము చెప్పలేరని నిర్ణయించి అందరును గలిసి కాశీ పురములో లోపా న్ముద్రతో నివసించు చున్న అగస్త్యుని యొద్దకు వెళ్ళిరి. ఆయన ,బ్రహ్మాది దేవతలను జూచి పరమాశ్చర్యము నొంది , వారికి తగిన మర్యాదలు చేసి ," మీరందరును నన్ను ధన్యుని జేయుటకే వచ్చినారని భావించెద " ననెను .బ్రహ్మ దేవుడు ముందునకు వచ్చి ,"మునీంద్రా ! ఒక లోకోపకారము నీ వలన కావలసి యున్నది .నీవు సామాన్యుడవు కావు గర్వాంధుడైన నహుషుని శపించి దేవలోకమును కాపాడినావు .సముద్రాల నీటిని త్రాగి కాలకేయాది రాక్షసులను జంపుటకు తోడ్పడినావు .ఈ లోపా ముద్ర రాజ కుమార్తె యైనను గణన కెక్కిన మహా పతివ్రత " అని పొగడు చుండగా " విషయ మేమో సెలవిం " డని అగస్త్యుడనెను. అంతట బ్రహ్మ " చూచితివి గదా ! లోకములకు గలిగిన ప్రళయము ? సూర్యోదయము కాలేదు . సర్వలోకములును చికాకు పడుచున్నవి . సూర్యచంద్రాదుల గమనములకు వింధ్యము అడ్డు వచ్చినది .నీవే వాని గర్వము నణచ గల సమర్దుడవు. ఇది లోక క్షేమంకరమైన కార్యము" అని పలుకగా అగస్త్యుడు సరియేనని అంగీకరించెను.
పైశాచము : కన్యకు గాని ఆమె వైపు వారికి గాని యిష్ట ముండదు. ఐనను వరుడు బలాత్కారముగా కన్య నెత్తుకొని పోయి చేసికొను వివాహము పైశాచము .దీనిని పెద్దలందరు ను గర్హింతురు
No comments:
Post a Comment