గాయత్రి చరిత్ర
మునుపు ఒకప్పుడు బ్రహమదేవుడు లోక క్షేమముగోరి పుష్కరతీర్ధమున యజ్ఞము చేయదలచి శ్రీ పతితో జెప్పెను. ఆయన " శివుడు నేనును అన్నియు చూచుకొందుము, కాని మ్మనెను". ముహూర్తము నిశ్చయించిరి. అందరాకును ఆహ్వానములు వెళ్ళెను.
ముహూర్తము సమీపించుచున్నది. బ్రహ్మ, సావిత్రిని పిలుచుకొని రమ్మని యింద్రుని బంపెను. అతడామెను రమ్మని తొందర పెట్టెను. ఆమె " పిలచిన నా వారెవ్వరును ఇంకను రాలేదు. వారు రాగానే వచ్చెదము " అని చెప్పెను. ఇంద్రుడా మాటలు బ్రహ్మకు చెప్పగా ఆయన, " ముహూర్తము దాటి పోరాదు. ఎవ్వతెనైన కన్యను జూడుము. భార్యగా గ్రహించి సంకల్పము చేసెద అనెను ". ఇంద్రుడు భూలోకమునకు త్వరగా బోయి, పెరుగు అమ్ముకొనుచున్న ఒక కన్యను చేయి పట్టుకొని బ్రహ్మ వద్దకు లాగుకొని వచ్చెను. ఆమె ఏడ్చెను. కాని బ్రహ్మను చూడగానే తనవారిని, తన లోకమును మరచిపోయెను. వెంటనే విష్ణురుద్రాదులు పెద్దలుగా గాంధర్వ వివాహము జరిగిపోయెను. సంకల్పము చేసి యజ్ఞము నారంభించినాడు బ్రహ్మదేవుడు.
గొల్లలందరును తన పిల్లను వెదుకుకొనుచు ఎవరో చెప్పగా విని బ్రహమలోకమునకు వచ్చి, లబో దిబో మనుచు గోల పెట్టుచుండగా విష్ణువు అక్కడికి వచ్చి "మీ పిల్ల సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మను పెండ్లాడినది. అంతకన్నా కావలసిన దేమున్నది ? నేను నారాయణుడను. మీ వంశములు పవిత్రమైనవి. నేను కృష్ణుడుగా అవతరించినప్పుడు మీ మధ్యనే ఉండెద. అని వరము నిచ్చెను ". గొల్లపిల్ల గాయత్రి వారితో " నేను ఆనందముగా నున్నాను. విచారింపకు " డనగా వారు తమ ఇండ్లకు బోయిరి.

ఈ తంతు
లన్నియు జరిగిన తరువాత తీరికగా సావిత్రి లక్ష్మీ పార్వతులతో ఇతర సఖులతోను వచ్చెను. జరిగిన సంగతులు తెలిసికొని మంది పడెను.
ఆమెను జూచి బ్రహ్మాదులు
భయపడిరి. ఆమె బ్రహ్మను, ఒక్క
కార్తీక పూర్ణిమనాడు తప్ప మరెప్పుడును
నిన్ను పూజించరు అని శపించెను. ఇంద్రుని జూచి, " నీవు శత్రువుల చేతిలో ఓడి అవమానములు లొందుదువని " శపించెను.
శ్రీహరిని జూచి, " నీవు రాముడ వైనపుడు భార్యా విరహము నొందుము. అంతేకాదు కృష్ణుడ
వైనపుడు పశువుల గాచుకొనుచు
బ్రతుకు అని శపించెను". శివుని జూచి " దారుకావానములో మును శాపమున నీ లింగము భూపతనమై నపుంశకూడ వౌదు అని
శపించెను".అగ్నిని జూచి, " నీవు
సర్వమల భక్షకుడవై రుద్ర వీర్యము త్రాగుదువని శపించెను". తరువాత అక్కడ నున్న విప్రులను జూచి " మీరు పరాన్న భోజనులై, తీర్ధక్షేత్రములందు దుర్దానములు గ్రహించుచు అనర్హులైన వారిచే యజ్ఞాదులు చేయించుచు
చివరికి ప్రేతత్వము
నొందెదరు గాక " యని శపించెను. శచీదేవి మున్నగు వారిని జూచి, " మీ రాలస్యము చేయుటచే ఈ యనర్ధము కలిగిన
దనుచు", శచిని, " నీవు నహుషుని వలన బాధపడుదు " వనియు, పార్వత్యాదులను
"దేవతాస్త్రీ లందరూ గొడ్రాళ్ళుగా నందురనియు" కోపావేశమున శపించి, యజ్ఞ శైలమునకు బోయెను. విష్ణు వామె దగ్గరకు వెళ్ళి అనేక విధముల స్తుతించి ప్రసన్నురాలిని జేసికొని
యాగశాలకు వచ్చెను.
No comments:
Post a Comment