అంతేకాదు, సృష్టి సమయములో ఈ నాస్త్రీ రూపము కల్పితము. కల్పాంత వేళ స్త్రీ పురుష నపుంశక భేదములు లేక ఏకరూపముగా నుందుము. వేదమాత గూడ ఇట్లే చెప్పుచున్నది గదా! " నాను నామైవ నామమే, న పుగ్ ౦సకం పుమాగ్ స్త్ర్యస్మి, స్థావరో స్మ్యథ జంగమః, యజే యక్షి యష్టాహే చ " (దీని యర్ధము: రాముడు కృష్ణుడు మున్నగు పేర్లు వ్యవహారము నందు మాత్రమే. వీని కంతకంటే ప్రయోజనము లేదు. ఈ పేరులు రూపములు అన్నియూ నా స్వరూపమే. కల్పాంతమందు ఏకమూర్తి నైన నేనే, సృష్టి కాలమున స్త్రీని, పురుషుడును, నపుంశకుడును గూడ అగుదును. స్థావరములును, జంగమ పదార్ధములును గూడ అగుదును. ఈ విధముగా పూర్వకల్పములలో సృష్టి యజ్ఞము చేసినాను. ముందుముందు చేయుదును కూడ " అందుచేత విరించీ ! నేను గానిది యీ సృష్టిలో లేదు. మీరు త్రిమూర్తులు గూడ నా యంశములే " అని చెప్పగా త్రిమూర్తులము మే మామెను స్తిటించి తదను గ్రహమును బొందినాము ". బ్రహ్మ చెప్పినది విని నారదుడు సంశయము దీరి యానందించెను.
శ్రీ చక్రో పాసకులు ఆ పరదేవతను మించిన శక్తి గాని దైవముగాని లేదందురు.
ఇట్లుండగా ఒక రాజు సైన్యములతో కాన్యకుజ్జమును ముట్టడించెను. నా పుత్రులు పౌత్రులును యుద్ధమునకు బోయి ఆ రాజు చేతిలో మరణించిరి. నాభర్త మాత్రము తిరిగి వచ్చెను. అపుడు నా దుఃఖము ఏమని చెప్పుదును ? ఆ సమయములో విష్ణుదేవుడు బ్రాహ్మణ వేషములో వచ్చి అశౌచ స్నానము పుణ్యతీర్ధములో చేయవలెననుచూ మమ్ము వెంటబెట్టుకొని పురుష తీర్ధముచేరి, " దీనిలో స్నానము చేసి రండి అని చెప్పెను. మే మందులో మునిగితిమి. మిగిలిన వారేమైనారో నాకు తెలియదు కాని, నేను యథాపూర్వముగా నారదుడనై గట్టు మీదకు వచ్చునప్పటికి, నావీణను, కృష్ణాజినమును బట్టుకొని విష్ణువు కనబడెను. నా భర్త పురుషుడనైన నన్ను జూచి, " కొడుకులను భార్యను కూడ పోగొట్టుకొంటి" నని విలపించెను. శ్రీ హరి అతనికి జ్ఞానబోధ చేసి పంపెను.
నేను విష్ణు మూర్తిని జూచి, "దేవా! నన్ను వంచన చేసి, మాయ యన్న నేమో చూపినావు. కాని నా కిది వింతగా నున్నది. నేను స్త్రీ రూపము నొందగానే పూర్వజ్ఞానము నశించిన దేమి ? స్త్రీ గానే భవించిన సుఖ దుఃఖములు
No comments:
Post a Comment