Friday, December 20, 2013

శ్రీ స్కంద పురాణము10





వింధ్య పర్వతము - అగస్త్యుడు
ఒకప్పుడు నారదుడు ఓంకార క్షేత్రమును దర్శించి మార్గ వశమున వింధ్య పర్వతము దగ్గరకు వచ్చెను .నారదుని జూచి వింధ్యము మానవ రూపముతో ఎదురు వచ్చి స్వాగతము పలికి తన నివాసమునకు గొనిపోయి ,దధి ,మధు ,ఆజ్య , నీర ,ఆర్ద్రాక్షత , దూర్వ , కుశ ,ప్రసూనములతో అష్టార్ఘ్యము లొసంగి పూజించెను. విశ్రాంతి తీసి కొనుచున్న నారదునికి పాదము లొత్తుచు " మీరు వచ్చుటచే నా ఇల్లు పవిత్రమైనది కుల పర్వతములలో మాన్యుడ నైతిని . మీరన్యదా భావించనిచో ఒక మాట చెప్పెదను.మేరు ప్రముఖ పర్వతాలకు భూమిని ధరించు సామర్ధ్యము న్నదని పెద్దలందురు. నేనును భూమిని భరించు చున్నాను .పార్వతీ జననము చేతను ,శివునికి మాయ యగుట చేతను హిమవంతుడు పర్వతాలకు రాజైనాడు .సరియే మరి, బంగారముతోను ,రత్నములతోను నిండి యున్నంత మాత్రమున మేరు పర్వతము గోప్పదగునా ? ఉదయ పర్వతమును చూతమా ,మందేహ రాక్షసులతో నిండి పోయినది., అస్త పర్వతము కాంతి హీనమైనది .
మందిరము సముద్రములో దిరిగి తిరిగి గ్రుడ్డి దైనది .మలయము సర్పములతో నిండినది .రైవతకము నేతి బీరకాయ వలె నుండి ధనము లియ్యజాలదు. మిగిలిన పర్వతాలకు భూమిని భరించు సామర్ధ్యము లేదు. మరి నాకేమి తక్కువ ?" అని పలుకగా వింధ్యుని గర్వమును గ్రహించి నారదుడు ,"ఇతడు శ్రీ శైలాదులను గమనించినట్లు లేదు " అనుకొని అప్పటికి తగిన మాటలాడి వెళ్ళిపోయెను.
వింధ్యునికి తాను తక్కువ వాడనను (ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్సు ) భావము కలిగి ,తన యాదిక్యమును నిరూపించు కొన వలెనను తపన గలిగెను. సూర్య చంద్రులు మేరువునకు ప్రదక్షిణము చేయుదురు .వారు నా చుట్టూ దిరుగు నట్లు చేసెదనని మహోన్నతముగా పెరిగి పోయెను.


 First  2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  15  16  17  18  19  Last  


No comments:

Post a Comment