ప్రహ్లాద
చరిత్ర
తన సోదరుడైన హిరణ్యాక్షుని జంపినాడను కోపముతో హిరణ్య కశిపుడు శ్రీ హరిని వధించుటకై బయలు దేరెను. విష్ణు వది యెరిగి సూక్ష్మ రూపుడై ఆ రాక్షసుని గుండెలలోనే దాగి యుండెను. అన్ని లోకములను శ్రీ హరికై వెదకి వెదకి ,అతడు కాన రాక పోవుటచే , తన పరాక్రమము విని శ్రీహరి గుండెలు పగిలి చచ్చి యుండునని తలచి రాక్షసుడు వెదకుట విరమించెను .
హిరణ్య కశిపునికి నలుగురు కొడుకులు .వారిలో పెద్దవాడు ప్రహ్లాదుడు . ప్రహ్లాదుడు మాతృ గర్భములో నున్నప్పటి సంగతి యిది. ఒకసారి హిరణ్యకశిపుడింటిలో లేని సమయము చూచి ఇంద్రుడు గర్భవతి యైన లీలావతి నెత్తుకుని పోవుచుండగా నారదుడు ఎదురై " యిదేల? " అని ప్రశ్నించెను ."హిరణ్య కశిపునకు బుట్టెడి వాడికెంత దుర్మార్గు డగునో యని యీమెను, గర్భస్థ శిశువును చంపుద మానుకొన్నా "నని ఇంద్రుడనగా నారదుడు ,"ఈమె గర్భమున బుట్టెడి వాడు దేవతలకు మిత్రుడే .ఈమెను నా యాశ్రమములో నిలిపి రక్షించెద "నని యామెను గొనిపోయెను . ఆమెకు విష్ణు కధలు వినిపించుచు ఆమెను ,ఆమె కడుపులో నున్న ప్రహ్లాదుని విష్ణు భక్తులుగా తీర్చి దిద్ది హిరణ్య కశిపుని ఇంట దిగ విడిచెను .
ప్రహ్లాదుడు భూత దయ గలవాడు .పెద్దలయందు వినయము గలవాడు .పరస్త్రీలను తల్లులుగా భావించెడి వాడు .ఆటలలో గూడ అసత్య మాడడు . సర్వకాల సర్వావస్థలందును హరినామ స్మరణ చేయుచుండు వాడు .
రాక్షస రాజు తన కొడుకును జూచి చదువని నాడజ్ఞాని యగునని చండా మర్కులను బిలిచి యోప్పగించెను . ప్రహ్లాదుడు గురువులు చెప్పినవి వినుచు గూడ తన హరినామ స్మరణము మానలేదు .
హిరణ్య కశిపుడు ,ప్రహ్లాదుని చదువు పరీక్షింప దలచి పిలిచి యడుగగా ,"చక్రహస్తుని ప్రక చించు చదువే చదువు " అనుచు విష్ణు మహిమను గూర్చి యుపన్యసించెను. రాక్షస రాజు గురువులపై కోపించగా

వారాతనిని మరల
గురుకులమునకు దీసికొని పోయి రాక్షసోచిత విద్యలు నేర్పసాగిరి . తిరిగి కొన్నాళ్ళకు తండ్రి పరీక్షింపగా ప్రహ్లాదుడు "చదువులలో
మర్మ మెల్ల చదివినా " ననుచు
"విష్ణు భక్తియే సంసార తరణో పాయ " మనెను .అది విని హిరణ్య కశిపుడు మహా కోపముతో భటులను బిలిచి వీనిని చంపుడని యాజ్ఞాపించెను .
వారు శూలముతో బొడిచిరి .
ఎనుగులచే త్రొక్కించిరి . పాములచేగరిపించిరి .సముద్రములో ముంచి వేసిరి .కొండ కొమ్ముల మీది నుండి పడ ద్రోసిరి .విషము బెట్టిరి
.అగ్నిలో తోసిరి
.అన్నము నీరు పెట్టక మాడ్చిరి .ఎన్ని చేసినను ప్రహ్లాదుడు చావలేదు హరి నామ స్మరణము మానలేదు . కొంచెము గూడ భయపడ లేదు. కందలేదు .
ఎన్ని చేసినను చావని
కొడుకును చూచి రాక్షస రాజు ఆశ్చర్య పడి ,చింతించు
చుండగా చండా మార్కులు
" చిన్నతనము చేత వీడిట్లున్నాడు కాని పెద్ద యైనచో బాగు పడును. వీనికి మరల విద్యలు భోధించెదమని తీసికొని పోగా ,ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షస బాలురను ప్రోగు చేసి వారి చేత గూడ హరినామ
సంకీర్తన చేయించెడి
వాడు .
గురువులు ఆందోళన పడుచు వచ్చి హిరణ్య కశిపునితో "నీ కొడుకును మేము చదివించలేము. వీడు మిగిలిన రాక్షస బాలకులను గూడా చెడ గోట్టుచున్నా" డని చెప్పిరి .హిరణ్య కశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని బిలిపించి ,"నీవు స్మరించుచున్న ఆ శ్రీ హరి యెచ్చట నున్నాడో చూపగలవా ? " అని యడుగగా ఆ భక్తుడు ,
"ఇందు గలడందు లేడను
సందేహము వలదు చక్రి సర్వోప గతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దాన వాగ్రణి ! వింటే "
అని సమాధాన మిచ్చెను. దానికి దానవ రాజు మరింత మండిపడి యీ స్తంబమున వానిని జూపు మనుచు ఒక స్తంబమును గదతో గొట్టెను. దాని నుండి నరసింహ మూర్తి యావిర్భ వించెను. హిరణ్య కశిపుడతనితో యుద్దమునకు తలపడెను . కాని నరసింహుడాతనిని బట్టుకుని తొడలపై బెట్టుకుని గోళ్ళతో చీల్చి సంహరించెను .ఆ ఉగ్ర నరసింహుని జూచి లోకములన్నియు భయపడెను . కాని ప్రహ్లాదుడు భయపడక అతనికి నమస్కరింపగా అతడు ప్రహ్లాదుని శిరస్సుపై చేయుంచెను .ఆ బాలుడు మహా జ్ఞానియై దేవుని స్తుతించెను .

No comments:
Post a Comment