కిరాతకుడు తన వీపుననున్న లోహపువల విప్రుని ముందు పెట్టి, " దీనిలో నిప్పు రాజబెట్టు " మనగా అతడట్లు చేసెను. " మంటలలో నొక దానిని నీవు వేరుచేసి పట్టుకొనుము. మిగిలిన వానిని నేను ఆర్పెద "ననెను. విప్రుడట్లే చేసెను. కిరాతకుడు నీళ్ళు దెచ్చి నిప్పుమీద గ్రుమ్మరించెను. అడుగున నున్న నిప్పు ఆరిపోయెను. అతడు విప్రునితో " నీ
చేతిలోని మంటను నా కిచ్చినచో మాంసము కాల్చుకొందు "ననెను. బ్రాహ్మణుడు వెఱ్ఱి వానివలె చూచెను. అప్పుడు కిరాతకుడు, " మహాత్మా! అగ్ని మొదలంట చల్లారినచో మంట లన్నియు నశించునట్లు, పరమాత్ముడు విశ్రాంతి గొనుచున్నప్పుడు సృష్టి యంతయు నశించును. అతడు వికృతుడైనచో (నిద్ర లేచి సృష్టి సంకల్పము గలవాడైనచో) సృష్టి జరుగును. ఇది సకల ప్రపంచముల యొక్క స్థితి. శరీర యాత్ర జరుపుకొనుట కెవ్వరికే ఆహారము దైవముచే నిర్ణయింపబడినదో దానిని పరమేశ్వరార్ప బుద్దితో స్వీకరించినచో, వారా పాపపుణ్యములను పొందురు" అని చెప్పినంతట అతనికై దేవ విమానము వచ్చెను.
No comments:
Post a Comment