Sunday, December 15, 2013

శ్రీ మద్భాగవతము17





శ్లో || ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నం సోత్త రీయంబు పై
      పాదాబ్జం బులపై ,కపోల తటిపై ,పాలిండ్ల పై ,నూత్నను
      ర్యాదం జెందు కరంబు క్రింద గుట మీదైనా కరం బుంటమే
      ల్లాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే ? కాయంబు నాపాయమే ?
అనుచు తన పత్ని వింధ్యావళి నీరు పోయగా ,"త్రిపాద ధరణిం దాస్యామి " అనుచు దాన ధార వామనుని చేతిలో వదలవలెను .వెంటనే వామనుడు ఇంతింతై ,అంతింతై పెరిగి సత్యలోకము దాకా వ్యాపించి ,తన తేజ శ్శరీరముతో ఒక పాదమును భూమిని ,రెండవ పాదమును ఆకాశమును ఆక్రమించి ,మూడవ పాదమునకు చోటేది ?" అని బలినడిగెను. బలి వింతగా చూసెను. "నాకియ్య వలసిన మూడవ అడుగు కొఱకు నిన్ను బంధించు చున్నా "నని వామనుడు బలిని పాశములతో బంధించెను . వింధ్యావళి పతి బిక్ష పెట్టమని ప్రార్ధించెను . బ్రహ్మ " దాన మిత్తునన్న యాతని నింక బంధించుట ఎందుకు ?" అని యడిగెను





No comments:

Post a Comment