పగటి కాలము లందును ,తల్లి దండ్రుల శ్రాద్ధ దినములందు ను , సర్వ పర్వములందును స్త్రీ సంగమం చేయరాదు. చేసినచో ధర్మము నుండి పతితుడగును దానివలన అధో
గతులు గలుగును.
కన్యల నమ్ముకుని ఆ ధనముతో జీవించు వాడు ఒక కల్ప పర్యంతము నరకములో నుండి పురుగులను ఆహారముగా తిను చుండును. వాడే కాక వాని పూర్వులను గూడ నరకములో బడ వేయును.
తన భర్తతో సంతుష్టి పడిన పతివ్రత యును , తన ధర్మపత్ని తో సంతుష్టి నొందెడు భర్తయును ఏ గృహమందుండునో ,అచ్చట శ్రీ మహా లక్ష్మి ,నారాయణునితో ,సహా నివసించి శుభములు గలుగ చేయును.
గృహస్థులకు నిత్యము పంచ సూనములతో (ఐదు విధములైన జీవుల వధ్య స్థానములు ) పని యుండును. అవి కండ ని = రోలు , పేషణి = తిరుగలి, లేదా సన్నికల్లు ,చుల్లీ =పొయ్యి, ఉద కుంభః= నీటి కడవ ,మార్జనీ = చీపురు కట్ట .ఈ ఐదింటిని గృహస్థులు వాడక తప్పదు. వాడునప్పుడు వారికి తెలియ కుండా కొంత జీవహింస జరుగ వచ్చును . ఈ పాపమును బోగొట్టు కొనుటకే వెనుక చెప్పిన పంచ మహా యజ్ఞములను గృహస్థులు చేయు చుండవలెను. వానితో పాప పరిహార మగును .
No comments:
Post a Comment