పూర్వము కైలాస పర్వతము మీద శంకరుడు బ్రహ్మాది దేవతలు కొలువై యుండి ,యీ స్కాంద పురాణమును వారికి వినిపించెను. పార్వతి అది విని కుమారస్వామికి (స్కందునకు ) చెప్పెను . ఆయన నంది గణమునకు చెప్పెను. నంది దత్తాత్రేయునకు జెప్పెను . ఆయన వ్యాసునకు చెప్పెను .వ్యాసుడు దానిని సూతునకు జెప్పెను . ఆయన శౌనకాది మునులకు జెప్పెను.
తత్పురుష కల్పములో , సర్వ సిద్దులను సమ కూర్చెడి మహేశ్వర ధర్మములు కుమార స్వామిచే లోకానుగ్రహ బుద్దితో చెప్పబడినది. అవి అన్నియు ఒక పురాణమై వెలసినవి .స్కందునిచే చెప్పబడిన పురాణము కావున ఇది స్కాంద పురాణమని ప్రసిద్ది కెక్కెను.
No comments:
Post a Comment