Sunday, December 15, 2013

శ్రీ దేవీ భాగవతము2




వారెక్కిరి. ఆ విమానము పైపైకి బోయెను. అక్కడ ఒక సత్యలోకము, దానిలో బ్రహ్మయు కనబడిరి. వీరు వింతగా జూచుచుండగా విమాన మింకనూ పైకి బోయెను. అక్కడ నొక వైకుంటము అందులో ఒక విష్ణుమూర్తియు కనబడిరి. విమాన మింకనూ పైకి పోగా ఇంకొక కైలాసము, రుద్రుడునూ కనిపించిరి. త్రిమూర్తులు ఆశ్చర్యపడుచుండగానే విమానము క్షీర సముద్ర మధ్యమున నున్న ఒక దీవికి జేరెను. అదే మణిద్వీపము. అక్కడ ఒక మహామందిరమును దానిలో నొక పానుపును వారికి గనబడెను. ఆ పానుపు మీద నవయౌవనవతియగు ఒక దేవీమూర్తి కనబడెను. ఆమె ప్రక్క సదాశివు డుండెను. త్రిమూర్తులు ఈమె యెవ్వరో అనుకొనుచున్నంతలో, ఆమె సహస్రబాహువులతో సహస్రనేత్రములతో సహస్ర పాదములతో విశ్వరూపిణి యై కనిపించెను. ఆమె కాలిగోళ్ళలో సకల బ్రహ్మాండములను కనిపించెను. దానితో త్రిమూర్తులు, ఆమెయే తమను గన్న తల్లి యని గ్రహించి    

స్తోత్రము చేసిరి. ఆమె దానికి సంతోషించి, బ్రహ్మనుజూచి, "నీవు నన్ను స్మరించుచూ సృష్టిని కొనసాగించు " మని యాదేశించి సరస్వతిని సృజించి అతనికి భార్యగా నిచ్చెను. విష్ణువును జూచి "నీవు బ్రహ్మ సృష్టించిన జగములను పోషణ చేయుచుండు" మని యాజ్ఞాపించి తననుండి లక్ష్మిని సృజించి యాతనికి భార్యగా నిచ్చెను. రుద్రుని జూచి "నీవు సృష్టించిన జీవులను కాలానుసారముగా నశింపజేయు చుండుము. మీకీ సృష్టి స్థితిసంహార శక్తులు నావలననే కలుగుచున్నవని గ్రహింపు డనుచూ", కాళీదేవిని సృజించి యతనికి భార్యగా నొసంగి, "మీమీ  పనులు నిర్వర్తింపుడని " యాదేశించి పంపివేసెను. దేవీ ప్రసాదమున, తమకట్టి శక్తులు గలిగినందుకు సంతోషపడుచూ, బ్రహ్మ సత్యలోకమునకు, శ్రీహరి వైకుంటమునకు, శివుడు కైలాశమునకు జేరిరి.

దేవీ మహిమ - 2
నారదుడు ఒకసారి బ్రహ్మ దగ్గరకు బోయి, "తండ్రీ! నీవు సృష్టి కర్తవనియు, శ్రీహరి పాలకుడనియు, రుద్రుడు సంహార కర్త యనియు చెప్పుచుందురు గదా! మరి, తత్త్వజ్ఞులు ఈ సర్వమును పరదేవతా మూలకమని చెప్పుదురేమి "అని ప్రశ్నించగా బ్రహ్మదేవుడు నారదునితో నిట్లనెను.

"మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులము, ముగ్గురమును దేవి సాన్నిధ్యమున నుండగా ఆమెను నే నిట్లడిగితిని "తల్లీ ! నీవు జగజ్జననివి. పరదేవతవు. ఈ సదాశివుడు నీ భర్త. అనగా నీ కంటే పరుడు. ఇది నిజమైనచో " ఏక మేవా ద్వితీయం బ్రహ్మ" అను వేదవాక్యము అబద్దమగుచున్నది గదా! దయచేసి ఈ అన్యోన్య విరోధమునకు పరిహారము చెప్పుము. నీవు స్త్రీనో, పురుషుడవో చెప్పు" మని ప్రార్దించితిని. ఆ జగన్మాత నవ్వుచు, " ఈ సదాశివుడే నేను. నేనే యీ

No comments:

Post a Comment