తదాపిన జహాత్యేత - త్ప్రార బ్దా దృష్ట ముల్బణమ్,
మత్తం కుర్యా ద్యదా మద్యం - నష్టా విద్య మపి ద్విజమ్ 41
తద్వత్ప్రా రబ్ద భోగో పిన జహాతి వివేకినమ్,
తతః కింబ హునోక్తేన - ప్రారబ్ద స్స శివ స్మృరః 42
బాధతే మాం ది నారాత్ర - మహంకారో పితా దృశః.
అత్యన్త పీడితో జీవ - స్థ్సూల దేహం విముం చతి 43
తస్మా జ్జీవాప్తయే మహ్య - ముపాయః క్రియతాం ద్విజ!
ఇతి శ్రీ పద్మ పురాణే, శివ గీతాయా ద్వితీయో ధ్యాయః 44
శ్రీ రాముడు పలుకును : ఓయీ ముని పుంగవా! మీరు నా యందలి
అనుగ్రహముచేత నేమి యాన తిచ్చితిరో అవి యన్నియు
వాస్తవములే అయినప్పటికిన్ని, నా ప్రారబ్ధ రూపంబగు ప్రియురాలైన
సీత యొక్క ఎడబాటుతో నాలో రగిలిన దుఃఖాగ్ని యుపశమింపకున్నది.
ఆ కారణము వలన వేయేల? నా ప్రారబ్ధ రూపుండైన శివుడే
అలరు విల్తుని రూపంబున నన్ను రేయింబవళ్ళు వేధింపు చున్నారు.
అహంకారము కూడా అటువంటిదే.
ఈ విధముగా ప్రాణి మిగుల పీడింప బడినచో నీ జడ దేహము విడిపోవును.
కనుక ఓ శివ భక్తాగ్రేసరా ! జీవ ధారణ చేయుటకు ఉపాయ మేదో తెల్పుము.
ఇది వ్యాసోక్త పద్మ పురాణాంతర్గతం బైన శివ గీతలో
ద్వితీయో ధ్యాయము సమాప్తము.
తృతీయాధ్యాయము
విరజాదీక్షా లక్షణ యోగము
అగస్త్య ఉవాచ:
న గృహ్ణాతివచ : పధ్యం - కామ క్రో ద్రూది పీడితః,
హితం న రోచతే తస్య - ముమూర్షో రివ భేషజమ్. 1
మధ్యే సముద్రం యానీతా - సీతా దైత్యేన మాయినా,
ఆయాస్యతి నారా శ్రేష్ఠ! - సాకధం తవ సన్నిధిమ్. 2
అగస్త్యుడు పలుకుచున్నాడు:
కామ క్రోధా ద్యరి షడ్వర్గం బుల కదీనుడైన వాడు నీతి
వచనములకు బెడ చెవిని పెట్టును. మరణమును
కోరుకున్న మనిషి మంచి మందును పుచ్చుకొనుట సమ్మతించడు.
అట్లే ఓ రామా! నీ ధర్మపత్ని యగు సీత మాయావి యైన
రావణుని చేత అపహరింప బడి సాగర మధ్యన ఉంచ బడినది.
అటువంటి నీ భార్య నీ చెంత కెట్లు రాగలదు?
భద్యన్తే దేవతా స్సర్వా - ద్వారి మర్కట యూధవత్,
No comments:
Post a Comment