ఇంద్ర ద్యుమ్నుడు
పూర్వ మింద్రద్యుమ్నుడు అను మహారాజు అనేక యజ్ఞములు చేసెను .ఆయన చేసిన యజ్ఞముల దర్భలతో భూమి రెండంగుళముల యెత్తు పెరిగినది .యజ్ఞాగ్ని హొత్రముల వేడికి భూమి ఉడికి పోయి ,లోపలినుండి జలము ధారగా పైకి పొంగి వచ్చెను. అదే మహీనది యను పేరు పొందెను.
ఇంద్రద్యుమ్నుడు దేహము చాలించి స్వర్గమునకు బోయి భోగములనుభవించు చుండెను. కొన్ని కల్పములు గడచెను . ఒకనాడు ఇంద్రద్యుమ్నుని బిలిచి ,"నీకు స్వర్గ సుఖానుభవముచే పుణ్యము చెల్లిపోయినది .పుణ్య హీనులు స్వర్గ మందుండుటకు వీలులేదు. నీ పుణ్యమును దిరిగి సంపాదించుకొని ర " మ్మని చెప్పెను. అతడు " నేను పుణ్య మెట్లు సంపాదింప వలె " నని యడుగగా "భూలోకములో నిన్ను గూర్చి ప్రశంసించు వారున్నచో ఆ కీర్తి వలన నీవు పుణ్యమును బొందినట్లే .వెళ్లి విచారించి ర " మ్మని పంపెను .పూర్వము తాను పరిపాలించిన కాంపిల్య నగరమునకు వచ్చెను. అంతయును క్రొత్తగా నుండెను ." ఇంద్రద్యుమ్నుడు అను రాజు పూర్వమీ నగరమును పాలించినాడు .అతనిని గూర్చి మీకు తెలియునా ?" అని అందరిని అడిగెను. వారు తెలియదు కాని సప్త కల్పముల ఆయుర్దాయము గల మార్కండేయు నడుగు " మనిరి.
No comments:
Post a Comment