భుంక్తే త్రిలోకీ మఖిలాం- యశ్శం భువర దర్పితః,
నిష్కంటకం తస్య జయః - కధం తన భవిష్యతి? 4
ఎవని భవన ప్రాంగణమున వానరుల గుంపు వలె దేవతలు
బంధింప బడినారో, ఆ దేవతల యొక్క భార్యలు వింజా
మరములను చేత బూని గాలి వేయుచున్నారో మరియు
నెవడైతే మహేశ్వర వరమును బొంది గర్వముతో స్వర్గ మర్త్య
పాతాళ లోకములను నిరాటంక ముగా బరిపాలించు చున్నాడో,
అటువంటి రావణాసురుని పరాభవింప చేయుట నీ తరమా?
ఇంద్ర జిన్నా మమ పుత్రోయ - స్తస్యా స్తీశ వరోద్దతః,
తస్యాగ్రే సంగరే దేవా - బహువారం పలాయతాః 5
కుంభ కర్ణా హ్వయో భ్రాతా - యస్యాస్తి సుర సూదనః,
అన్యోది వ్యాస్త్ర సంయుక్త - శ్చిరం జీవీ విభీషణః 6
మరియు (పోగా ) నాతనికి ఇంద్రజిత్తు డనే కుమారుడున్నాడు.
అతడు పరమశివుని వరము చేత మహా బలశాలియై యింతవరకు
దాను పరాభావమన నెట్టిదో ఎరుగడు.
అటువంటి యోధుని ఎదుట నిలిచి యుద్దము చేయుటకు శక్తి లేక
యుద్ద భూమి నుండి అనేక సార్లు దేవతలు పలాయనము జిత్తగించిరి.
అది యట్లుండగా సుపర్వ గర్వము నణచి వేసిన కుంభ కర్ణుండు
అతనికి తోబుట్టువు. మరియు దివ్యాస్త్రములతో సంసిద్దుడై యుండిన
చిరంజీవి యగు విభీషణుడు కూడా అతనికి అనుంగ సోదరుడే.
దుర్గం యస్యాస్తి లంకాఖ్యం దుర్జయం దేవ దానవై:,
చతురంగ బలం యస్య - వర్తతే కోటి సంఖ్యయా.7
ఏకాకి నా త్వయా జేయ - స్సకధం నృప నందన!
ఆకాంక్షతే కారే దుర్తుం - బాలశ్చంద్ర మాసం యధా 8
సురాసురులకు ప్రవేశించుట వీలులేని (శక్యము కాని )ది,
అజేయమైనది లంకాపురము రాజధానిగా అతనికి కలదు,
మరియు కోట సంఖ్యాక (అసంఖ్యాక )మైన గజ - తురగ -పదాతి
మున్నగు చతురంగ సైన్యము గల అంతటి రావణుని నీ వొక్కండ
వెట్లు జయింప దలచావు.? నీ తలంపును విచారించినచో
బాల్యావస్థలో నున్న శిశువు తన హస్తములతో నాకాశ మందలి
చంద్రుని గ్రహించు మాడ్కి కామ మోహింతు డవైన నీవు గొప్ప
బలశాలి యైన రావణుని చంప చూస్తున్నావు.
తధాత్వం కామ మోహేన - జయం తస్యాభి వాంఛసి,
No comments:
Post a Comment