Wednesday, December 18, 2013

శ్రీ నారద పూరాణము3




కనక మాలినికధ
శ్రీరాముడ రణ్యవాసము చేసినప్పుడు కల్యాణ తీర్ధమున మునిగి నారాయణగిరి మీద నున్న నారాయణుని సేవించెను. పట్టము గట్టుకొన్న తరువాత, ఆంజనేయుని బిలిచి నారాయణ గిరి మీద నున్న విగ్రహమును దెమ్మనెను. అతడక్కడ నున్న అర్చా విగ్రహమును దెచ్చి రాముని కిచ్చెను. రాముడు తన తరువాత, పూజించు చుండుమని కుశునికిచ్చెను. కుశునికి హేమమాలికతో ఒక కుమార్తె జన్మించెను. ఆమె అల్లారు ముద్దుగా పెరిగి పెద్ద దయ్యెను. కుశుడామెకు వరుని వెదకుచుండగా సీతారాములు స్వప్నములో కనిపించిరి. రాముడు " యదుభూషణుని కొడుకు యదుశేఖరుడున్నాడు; వానికి నీ కూతురు నిచ్చి పెండ్లి చేయు" మని చెప్పగా సీత" ఆడ పిల్ల పుట్టింటి నుండి సారెలు తీసికొనుపోవు టాచారము. ఆమె యడిగినది ఇచ్చి పంపు" మని చెప్పెను. నారదుడు పెండ్లి పెద్దగా సంబంధము నిశ్చయ మయ్యెను. కుశుడు కుమార్తెకు పెండ్లి చేసి సారెలిచ్చి పంపుటకు సిద్ద మయ్యెను. హేమమాలిని తండ్రితో " నాన్నా! మనకుల దైవ మైన నారాయణ మూర్తి విగ్రహమును నాకిచ్చినచో ఆనందముగా బయలుదేరుదును" అనగా కుశుడామెకు ఆ విగ్రహము నిచ్చెను. క్రొత్త దంపతలు మాధవుని విగ్రహముతో తమ పురము కేగి దాని నొక మందిరములో ప్రతిష్టించి పూజించిరి. అది క్రమముగా యాదవ కులదీపమైన వసుదేవుని యొద్దకు వచ్చెను. శ్రీ కృష్ణుడు ఆ వంశముతో బుట్టి కంసవధ చేసిన తరువాత, ఒకనాడు బలరాముడు తీర్ధయాత్రలు చేయుచు నారాయణాద్రికి వచ్చెను. అక్కడ నున్న నారాయణుని విగ్రహమును జూచి పరమభక్తితో సేవించి యింటికి వచ్చి కృష్ణునితో నిట్లనెను." కృష్ణా! నాకిది వింతగా నున్నది. నారాయణాద్రి మీద నున్నవి గ్రహరూపమునకును మన యింటిలో నున్న విగ్రహరూపమునకు భేదము రవ్వంతయు నాకు కనబడ లేదు". కృష్ణ బలరాములా విగ్రహముతోను, వసుదేవాదులతోను నారాయణాద్రికి వెళ్ళియీ మూర్తిని గూడ అక్కడ ప్రతి ప్రతిష్టించి, సేవించి యమితానంద మొందిరి. అప్పటి నుండి అది యాద వాద్రి యని గూడ పేరు పొందెను.   
అవతార పురుషులు గూడ జగత్కల్యాణమున కై కొన్ని లోకా చారములను పాటించుచుందురు.


First  2  3  4   5  6  7  8  9  10  11  12  13  14  15  16  17  18  19  Last


No comments:

Post a Comment