చంద్రాంగదుడు యమునా తీరమునకు వచ్చెను .అతని భార్య వితంతు వేషముతో శివాలయమునకు వచ్చెను. ఆమెను జూచి ఎక్కడో చూచినట్లున్న దనుకొని " నీ వెవరు? ఇట్లుండుటకు కారణమే " మనగా ఆమె ,తన వృత్తాంతము చెప్పెను. ఆమె తన భార్యయని తెలిసికొని " నీ భర్త మూడు నాలుగు రోజులలో వచ్చును. నే నాతని మిత్రుడను " అని చెప్పి తన పురమునకు వెళ్లి కోట ముందు నిలబడి ,శత్రు రాజుల నుద్దేశించి " మీకు ప్రాణముల మీద ఆశ యున్నచో ఉన్నపాటున నగరము విడిచి పొండు. నేను నలుని మనుమడను . చంద్రాంగదుడను తక్షకుని వాళ్ళ వరములు పొంది వచ్చినాడను నా మాటలు లెక్క చేయనిచో మిమ్ము నా బాణాగ్నిలో భస్మము చేసెద " నని చెప్పెను. శత్రు రాజు వచ్చి చూచి ,రాజకుమారుని ధైర్య సాహస పరాక్రమాదులకు భయపడి ,అతని రాజ్యమును విడిచి వెళ్ళిపోయెను .చంద్రాంగదుడు తల్లిదండ్రులను చెర నుండి విడిపించి, తన కధను వినిపించెను. ఇంద్రసేనుడు తన వియ్యంకునకు చంద్రాంగదుడు క్షేమముగా వచ్చినాడని వార్త పంపెను. అతడు బ్రహ్మానందము నొంది కుమార్తెతో ," తల్లీ ! నీవు చేసిన సోమవార వ్రతము ఫలించినది . నీ భర్త తిరిగి వచ్చినాడు " అని చంద్రాంగదుని కిచ్చి మహా వైభవముతో పెండ్లి చేసెను. అతడు సీమంతినితో గలసి సోమవార వ్రతము నియమముగా జేయుచు పది వేలెండ్లు రాజ్య పాలన చేసి శంకరుని అనుగ్రహము బొందెను.
BhimasingiGiriAchary
- Sandhya
- HarsaPriya SivaMahadeva's Parivar
- Amruth Fabrication
- Ratnakar Hindu
- Vani Telugu
- Vinnu News
- Vissu-Images/Photos
- Panchangam
- Tour / Temples
- వాస్తు(Vastu)Devagiri
- Mahaniyulu
- Sastras
- My Near MahaKshetras
- Vedapatanam
- SatakaSahiti
- Odiya
- BharathaMaata-
- My Self
- Hindi
- Puranas
- నవ గ్రహాలు :
- Pujas Vratas
- birds /animals
- Flowers/Fruits
- Nada Yoga-Yoga
- Indian Law
- శకునాలు శాస్త్రములు
Friday, December 20, 2013
శ్రీ స్కంద పురాణము3
చంద్రాంగదుడు యమునా తీరమునకు వచ్చెను .అతని భార్య వితంతు వేషముతో శివాలయమునకు వచ్చెను. ఆమెను జూచి ఎక్కడో చూచినట్లున్న దనుకొని " నీ వెవరు? ఇట్లుండుటకు కారణమే " మనగా ఆమె ,తన వృత్తాంతము చెప్పెను. ఆమె తన భార్యయని తెలిసికొని " నీ భర్త మూడు నాలుగు రోజులలో వచ్చును. నే నాతని మిత్రుడను " అని చెప్పి తన పురమునకు వెళ్లి కోట ముందు నిలబడి ,శత్రు రాజుల నుద్దేశించి " మీకు ప్రాణముల మీద ఆశ యున్నచో ఉన్నపాటున నగరము విడిచి పొండు. నేను నలుని మనుమడను . చంద్రాంగదుడను తక్షకుని వాళ్ళ వరములు పొంది వచ్చినాడను నా మాటలు లెక్క చేయనిచో మిమ్ము నా బాణాగ్నిలో భస్మము చేసెద " నని చెప్పెను. శత్రు రాజు వచ్చి చూచి ,రాజకుమారుని ధైర్య సాహస పరాక్రమాదులకు భయపడి ,అతని రాజ్యమును విడిచి వెళ్ళిపోయెను .చంద్రాంగదుడు తల్లిదండ్రులను చెర నుండి విడిపించి, తన కధను వినిపించెను. ఇంద్రసేనుడు తన వియ్యంకునకు చంద్రాంగదుడు క్షేమముగా వచ్చినాడని వార్త పంపెను. అతడు బ్రహ్మానందము నొంది కుమార్తెతో ," తల్లీ ! నీవు చేసిన సోమవార వ్రతము ఫలించినది . నీ భర్త తిరిగి వచ్చినాడు " అని చంద్రాంగదుని కిచ్చి మహా వైభవముతో పెండ్లి చేసెను. అతడు సీమంతినితో గలసి సోమవార వ్రతము నియమముగా జేయుచు పది వేలెండ్లు రాజ్య పాలన చేసి శంకరుని అనుగ్రహము బొందెను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment